మహిళ దారుణ హత్య
సేలం: ఈరోడ్–చెన్నిమలై రోడ్డు నుండి తిండాల్‌కు వెళ్లే రింగ్ రోడ్డులో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. మంగళవారం ఉదయం ఓ పాల వ్యాపారి ఈ ప్రాంతం గుండా వెళ్లాడు. ఆ సమయంలో రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఖాళీ స్థలంలో ఓ మహిళ తల ఛిద్రమై నగ్నంగా మరణించి కనిపించింది. విషయాన్ని ఈరోడ్ తాలూకా పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళ వయస్సు 30 సంవత్సరాలు. ఆమె శరీరం దగ్గర ఎరుపు రంగు బ్లౌజ్ ఉంది. ఒక రాయి కూడా ఉంది. ఆ రాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళ నగ్నంగా హత్యకు గురైనందున, ఆమైపె అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణం నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


