చాలా సంతృప్తి కరంగా రూట్
మయిలా చిత్రంలో నీ మెలోడి డార్కస్
ప్రదీప్ రంగనాథన్ చిత్రంలో మమితా బైజు
తమిళసినిమా: నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళం భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే అంతకుముందే ఈమె నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. సెన్సార్ సమస్యల్లో ఇరుక్కున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కర చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈయనకు జంటగా ఒక చిత్రంలోని ఈ రెండు వారం అనే మరో చిత్రంలోని అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.
తమిళసినిమా: నిర్మాతలు ఎప్పుడైతే తమ చిత్రాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తారో, ఆ చిత్రాలు సక్సెస్ అయినట్లే. ఆ విధంగా రూట్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ చిత్రంపై ఆ చిత్ర నిర్మాతలు చాలా సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అపర్శక్తి కురాణ నాయకిగా నటిస్తున్నారు. నటి భవ్య ట్రిఖ, వైజీ. మహేంద్రన్, పావని రెడ్డి, లింగ, ఆర్జే ఆనంది తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సూర్య ప్రతాప్. ఎస్. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వెరూస్ పతాకంపై షేక్ ముజీబ్, ధనిస్తాన్ ఫెర్నాండో, రాజరాజన్ జ్ఞాన సంబంధం, సంజయ్ శంకర్‌లో కలిసి నిర్మిస్తున్న చిత్రం రూట్. కాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శక నిర్మాతలు మీడియాకు వెల్లడించారు. ఇది టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు సూర్య ప్రతాప్ తెలిపారు. ఇది ఊహలు, కలలు వంటి అంశాలతో కూడిన కథా చిత్రం అని తెలిపారు. చిత్ర షూటింగును చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కాగా రూట్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, వీఎఫ్‌ఎక్స్, సౌండ్ డిజైనింగ్ మొదలగు అన్ని కార్యక్రమాలు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ చిత్రం కథను చెప్పినప్పుడే తమకు నచ్చిందని, ఆయనపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే చిత్రం చాలా సంతప్తికరంగా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అదేవిధంగా నటి అపర్శక్తి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు.
చాలా సంతృప్తి కరంగా రూట్
చాలా సంతృప్తి కరంగా రూట్
చాలా సంతృప్తి కరంగా రూట్


