వైద్య సంరక్షణ సేవలు మరింత విస్తృతం | - | Sakshi
Sakshi News home page

వైద్య సంరక్షణ సేవలు మరింత విస్తృతం

Feb 12 2026 1:21 PM | Updated on Feb 12 2026 1:21 PM

వైద్య సంరక్షణ సేవలు మరింత విస్తృతం

వైద్య సంరక్షణ సేవలు మరింత విస్తృతం

సాక్షి, చైన్నె: సమగ్ర వైద్య సంరక్షణ సేవల విస్తృతంలో ప్రైవేటు భాగస్వామ్యం అవశ్యమని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. ఊబకాయం (ఒబేసిటీ), మధుమేహం (డయాబెటిస్‌) వంటి జీవనశైలి వ్యాధుల నివారణ, చికిత్స కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘రెవివో క్లినిక్‌ – ఇంటిగ్రేటెడ్‌ కేర్‌ ఫర్‌ ఒబేసిటీ అండ్‌ డయాబెటిస్‌’ చైన్నెలో ప్రారంభమైంది. దీనిని బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వ వైద్య పథకాలు, సేవల విస్తృతం గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో రెవివో క్లినిక్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అరుణ్‌ రాఘవన్‌, ది క్వాడ్‌ సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ అశోక్‌ లు మాట్లాడుతూ, ఊబకాయం, మధుమేహం వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను స్థాపించినట్లు తెలిపారు. క్లినికల్‌ నైపుణ్యాన్ని నిర్మాణాత్మక జీవనశైలి మార్పులతో అనుసంధానించడం ఈ కేంద్రం ప్రత్యేకతగా పేర్కొన్నారు. పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్య మద్దతు, ప్రవర్తనా మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రోగికి వ్యక్తిగత చికిత్సా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ‘‘జీవనశైలి మార్పులు లేకుండా మందులు సరైన ఫలితాలు ఇవ్వవు అని, అలాగే వైద్య పర్యవేక్షణ లేకుండా జీవనశైలి మార్పులు నిలబడవు అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement