విద్యతోనే అసమానతలు దూరం
కొరుక్కుపేట: విద్యతోనే సమాజంలోని అసమానతలు దూరమవుతాయని తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్), జనోదనం వ్యవస్థాపకుడు డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయేల్ అన్నారు . జనో అల్యుమిని స్టూడెంట్స్ ఆధ్వర్యంలో సమాజానికి చేసిన సేవలకు గొల్లపల్లి ఇజ్రాయేల్‌కు సత్కార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పెరియమేట్‌లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్‌ఆర్‌డీ సెంటర్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించి శాలువా, గజమాలలతో ఘనంగా సత్కరించారు . గొల్లపల్లి ఇశ్రాయేల్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన ధ్యేయమన్నారు.


