రూ. 3 కోట్ల విలువైన హైగ్రేడ్‌ గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ. 3 కోట్ల విలువైన హైగ్రేడ్‌ గంజాయి స్వాధీనం

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

రూ. 3

రూ. 3 కోట్ల విలువైన హైగ్రేడ్‌ గంజాయి స్వాధీనం

● తిరువణ్నామలై, వేలూరుకు ప్రత్యేక రైళ్లు

అన్నానగర్‌: చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయానికి శనివారం వేకువజామున థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుండి ఓ విమానం చేరుకుంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి పర్యాటక వీసాపై థాయిల్యాండ్‌ పర్యటన నుండి తిరిగి వచ్చాడు. కస్టమ్స్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులుకు అనుమానం వచ్చి అతని వస్తువులను తనిఖీ చేశారు. అతని సూట్‌కేస్‌ లోపల సెల్ఫీలు తీసుకోగల ఆటోమేటిక్‌ కెమెరా ఉంది. 8 ప్యాక్‌ చేసిన పుడ్‌ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా, అందులో దాచిపెట్టిన 3 కిలోల హైడ్రోపోనిక్‌, హైగ్రేడ్‌ గంజాయి కనిపించింది. దీని విలువ దాదాపు రూ. 3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. కాగా గంజాయిని అక్రమంగా రవాణా చేసిన యువకుడిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మహాశివరాత్రిని

పురస్కరించుకుని..

తిరువొత్తియూరు: మహాశిరాత్రిని పురస్కరించుకుని తిరువవణ్నామలై ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాగే తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్నామలైకి బస్సులు రైళ్లు వెళ్తున్నాయి. అయిన్నప్పటికీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో చైన్నె ఎగ్మోర్‌ నుండి తిరువణ్నామలైకి ప్రత్యేక రైలు ప్రకటించారు. ఈ రైలు నేడు (ఆదివారం) ఉదయం 10.15 గంటలకు ఎగ్మోర్‌ నుండి బయలుదేరి తిరువణ్ణామలైకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. 16వ తేదీన సోమవారం ఈ రైలు తిరువాణ్ణామలై నుండి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి చైన్నె ఎగ్మోర్‌కి ఉదయం 9.15 గంటలకు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఎగ్మోర్‌ నుండి వేలూరు కంటోన్మెంటుకు రిజర్వేషన్‌ మెమో ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఈ రైలు ఎగ్మోర్‌ నుండి రేపు మధ్యాహ్నాం 12 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 6.00 గంటలకు వేలూరుకు చేరుతుంది. తర్వాత 16వ తేదీన వేలూరు కంటోన్మెంట్‌ నుండి తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ఉదయం 9.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ 2 రైళ్ల రిజర్వేషన్లు శనివారం మధ్మాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా విల్లుపురం తిరువణ్ణామలై మధ్య వేలూరు–విల్లుపురం మధ్య రిజర్వేషన్లు లేని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణరైల్వే అధికారులు తెలిపారు.

డీఎంకేలోకి నిలోఫర్‌ కఫీల్‌

సాక్షి, చైన్నె: మాజీ మంత్రి, అన్నాడీఎంకే మైనారిటీ మహిళా నేతల నిలోఫర్‌ కఫీల్‌ డీఎంకేలో చేరారు. తిరుపత్తూరులో శనివారం జరిగిన డీఎంకే బూత్‌ కమిటీ మండల మహానాడు వేదికగా ఆమె సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి వేలూరు జిల్లాలో నిలోఫర్‌ కఫీల్‌ మైనారిటీ మహిళా కీలక నేతగా వ్యవహరించే వారు. ఆమెకు దివంగత సీఎం జె. జయలలిత ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. 2016లో అన్నాడీఎంకే మంత్రివర్గంలో ఆమెకు కార్మిక సంక్షేమ శాఖను అప్పగించారు. ఇదే జిల్లాలోని మరో మంత్రి కేసీ వీరమణి, నిలోఫర్‌ కఫీల్‌ మధ్య గతంలో వార్‌ సైతం సాగేది. 2021లో నిలోఫర్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా పార్టీ కోసం శ్రమిస్తూ వచ్చారు. ఈపరిస్థితులలో తిరుపత్తూరుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఆమెతో పాటుగా అన్నాడీఎంకేకు చెందిన మైనారిటీ నేతలు, మహిళ నేతలు అనేక మంది డీఎంకే పార్టీలో చేరారు.

ఎండోమెంట్‌

ఓరేషన్‌ అవార్డు ప్రదానం

సాక్షి, చైన్నె: శ్రీ రామచంద్ర ఉన్నత విద్య పరిశోధన సంస్థలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను ఒకే వేదికపైకి తెచ్చే విధంగా ‘లింక్‌ – లెర్న్‌ – లీడ్‌‘ అనే అంశంపై ఇండియన్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ అసోసియేషన్‌ సదస్సును నిర్వహించారు. తమిళనాడు డాక్టర్‌ జె. జయలలిత మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌–చాన్స్‌లర్‌ డాక్టర్‌. ఎస్‌. సౌమ్య, ఎన్‌ఐఈపీఎండీ డైరెక్టర్‌ నచికేత రౌత్‌, శ్రీహెర్‌ ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, వీసీ డాక్టర్‌ ఉమా శేఖర్‌ ఈసందర్భంగా న్యూరో–కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌ రంగంలో స్పీచ్‌–లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌గా 20 సంవత్సరాల పాటు చేసిన అంకితభావ సేవకు గుర్తింపుగా అన్నమ్మ జార్జ్‌కు ఎస్‌. మనోహరన్‌ ఎండోమెంట్‌ ఓరేషన్‌ అవార్డును అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ప్రకాష్‌ భూమినాథన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ ఆర్‌.సి. పెరుమాళ్‌, ఇషా టీఎన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రంజిత్‌ రాజేశ్వరన్‌, ఇషా టీఎన్‌ కార్యదర్శి డాక్టర్‌ సుందరేశన్‌ పాల్గొన్నారు.

రూ. 3 కోట్ల విలువైన  హైగ్రేడ్‌ గంజాయి స్వాధీనం 
1
1/1

రూ. 3 కోట్ల విలువైన హైగ్రేడ్‌ గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement