నైనార్‌ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ | - | Sakshi
Sakshi News home page

నైనార్‌ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

నైనార్‌ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ

నైనార్‌ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ

● విజయ్‌కు, ఓ హీరోయిన్‌తో కలిపి అనుచిత వ్యాఖ్యలు ● ఖండించిన అన్నివర్గాల నేతలు

సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీయడంతో సర్వత్రా పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు. ఇంతకీ ఆయన టీవీకే అధినేత విజయ్‌, ఓ ప్రముఖ సినీ నటి ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈరచ్చకు కారణంగా మారాయి. వివరాలు.. టీవీకే అధినేత విజయ్‌ తనప్రసంగంలో ఓ వైపు డీఎంకేను, మరోవైపు బీజేపీని తీ వ్రంగా టార్గెట్‌ చేస్తూవస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో విజయ్‌కు గట్టిగా సమాధానం ఇచ్చే వి ధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ చేసిన ఎదురు దాడి అనుచిత వ్యాఖ్యలకు దారి తీసింది. అనుభవం లేని వ్యక్తి, అయ్యో పాపం రాజకీయాలు తెలియని వ్యక్తి అంటూ ఎద్దేవా చేస్తూ, ముందు ఇంటి నుంచి బయటకు విజయ్‌ను రానివ్వండీ అంటూనే, తన కుటుంబానికి ఆయన తొలి ప్రాధాన్యతను ఇవ్వమనండి అని నైనార్‌ వ్యాఖ్యానించారు. అలాగే అంత కంటే ముందుగా ప్రముఖ హీరోయిన్‌ ప్రభావం నుంచి బయట పడమనండీ అన్న వ్యాఖ్యలతో వ్యక్తిగత దాడికి దిగడం వివాదానికి దారి తీసింది. నైనార్‌ వ్యాఖ్యలను శనివారం సర్వత్రా ఖండించారు.

ఇది తగదు..

విజయ్‌ను వ్యక్తిగతంగా నైనార్‌ టార్గెట్‌ చేయడం, ఇందులోకి ఓ ప్రముఖ నటిని లాగడాన్ని ఖండిస్తూ నేత లందరూ పార్టీలకు అతీతంగా మీడియా ముందు స్పందించారు. డీఎంకే ఎంపీలు తమిళచ్చి తంగ పాండియన్‌, కనిమొళి సోము స్పందిస్తూ, ఓ మహిళను కించ పరిచే విధంగా బాధ్యత గల పదవిలో ఉన్న నేత వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీలోని మహిళా నేతలు నోరు వి ప్పాలని, సదరు హీరోయిన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీసీకే నేత తిరుమావళవన్‌ స్పందిస్తూ, ఇది పద్ధతి కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలను అంగీకరించ బోమని మండిపడ్డారు. సీపీఎం నేత ష ణ్ముగం స్పందిస్తూ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను బాధ్యత గల పదవిలో ఉన్న నేతలు మానుకోవాలని, ఆయన ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌సీసీ నేత సెల్వ పెరుంతొగై స్పందిస్తూ, రాజకీయ విమర్శలు రాజకీయంగానే ఉండాలేగానీ, వ్యక్తిగత దాడులకు దారితీయ కూడదని మండిపడ్డా రు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ మాట్లాడుతూ, తాను ఆ వ్యాఖ్యలను విన లేదు, చూడ లేదని, అయితే, వ్యక్తిగతంగా ఒకర్ని దాడి చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. టీవీకే నేతలు సెంగొట్టయ్యన్‌, నిర్మల్‌కుమార్‌ స్పందిస్తూ దిగజారుడు రాజకీయాలు బీజేపీకి తగదు అని మండిపడ్డారు. వారిలో ఓటమి భయం పెరిగిందని, అందుకే టీవీకేను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, సామాజిక మాధ్యమాలలో అయితే నైనా ర్‌ నాగేంద్రన్‌ను ఓ వైపు విజయ్‌, మరోవైపు ప్రముఖ హీరోయిన్‌ అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement