నిర్మాత తమిలళగన్‌ కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

నిర్మాత తమిలళగన్‌ కన్నుమూత

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

నిర్మాత తమిలళగన్‌ కన్నుమూత

నిర్మాత తమిలళగన్‌ కన్నుమూత

తమిళసినిమా: దివంగత ప్రముఖ రాజకీయనాయకుడు, సినీ నిర్మాత ఆర్వీ .వీరప్పన్‌ కొడుకు, నిర్మాత, దర్శకుడు వి. తమిలళగన్‌ శనివారం చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 70 ఏళ్లు. తమిలళగన్‌ ఆర్వీ.వీరప్పన్‌ పెద్ద కొడుకు. రజనీకాంత్‌ నటించిన బాషా, రాణువ వీరన్‌, పణక్కారన్‌, మూండ్రుముగమ్‌, కమలహాసన్‌ హీరోగా నటించిన కాక్కీసట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాలను తమిలళగన్‌ నిర్మించారు. అదేవిధంగా మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా తమిలళగన్‌ శనివారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమిళళగన్‌ భౌతిక కాయానికి ఆదివారం స్థానిక త్యాగరాయనగర్‌, తిరుమలైపిళ్లై రోడ్డులో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తమిళగన్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడు రజినీకాంత్‌ తన సంతాప ప్రకటనలో ఆర్వీ వీరప్పన్‌ కొడుకు, తన ప్రియమైన సహోదరుడు తమిలళగన్‌ అద్భుతమైన మనిషి అని పేర్కొన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు రజినీకాంత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement