ఇళయరాజా బయోపిక్ చిత్ర దర్శకుడు వైదొలిగారా?
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి చాలా కాలం క్రితమే బీజం పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను నటుడు ధనుష్ పోఫించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా కాలం క్రితం చైన్నెలో భారీ ఎత్తున జరిగాయి. నటుడు కమలహాసన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు ఆ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆ చిత్రం ఇప్పటి వరకూ సెట్‌పైకి వెళ్లలేదు. అంతే కాకుండా మొదట్లో అనుకున్న దర్శకుడు మారిపోయారు. అంతే కాదు చిత్ర నిర్మాణ సంస్థ డ్రాప్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్ హీరోగా ఇంతకు ముందు కెప్టెన్ మిల్లర్ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాదేశ్వరన్ ఇళయరాజా బయోఫిక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు.ఇది జరిగి కూడా చాలా కాలం అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమచారం లేదు. కాగా తాజాగా ఇళయరాజా బయోఫిక్ చిత్రం నుంచి దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ కూడా వైదొలగారనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై నటుడు ధనుష్ వర్గం స్పంధించారు. సోమవారం వారు ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఇళయరాజా బయోఫిక్ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ చిత్రం నుంచి దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ వైదొలగలేదనీ, ప్రస్తుతం ఆయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ చిత్రంపై దృష్టి సారిస్తున్నారని, ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఇళయరాజా బయోఫిక్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ఇళయరాజా బయోఫిక్ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఽధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నటుడు ధనుష్ తన 55వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పేరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. కీలక పాత్రలో నటుడు మమ్ముట్టి నటించనున్నారు. సాయ్ అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ బడ్డెజ్ చిత్రాన్ని నటుడు ధనుస్‌కు చెందిన వండర్‌బార్ ఫిలింస్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీంతో ఆ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి.


