సత్‌వచ్చారిలో మేస్త్రి దారుణ హత్య
– హిజ్రాతో పాటూ ఐదుగురు అరెస్ట్
వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని వావుసీ నగర్‌కు చెందిన రాము(45) భవన నిర్మాణ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాము రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా రాముకు అదే ప్రాంతానికి చెందిన వారితో గురువారం రాత్రి ఘర్షణ జరిగినట్లు దీంతో వారు హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు హిజ్రాతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సత్‌వచ్చారిలో మేస్త్రి దారుణ హత్య


