ధనుష్‌ @56 | - | Sakshi
Sakshi News home page

ధనుష్‌ @56

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

ధనుష్‌ @56

ధనుష్‌ @56

ధనుష్‌ @56

తమిళసినిమా: ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న స్టార్‌ హీరో ధనుష్‌. ఈయన నటిస్తున్న కర చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ధనుష్‌ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు.రాజ్‌ కుమార్‌ పెరియ సామి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీ లీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మలయాళం సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ధనుష్‌ తన 56వ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను ఇంతకుముందు ఎప్పుడు చేయని ప్రయత్నంగా ఈ చిత్రాన్ని పిరియడ్‌, ఫాంటసీ కథాచిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీని పూర్తిగా ఫాంటసీ కథాచిత్రం అని చెప్పలేనని చిత్రంలో ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని చెప్పారు. అప్పుడే ఈ చిత్ర కథ సరైన బాటలో సాగుతుందని ఈ కథను చెప్పగా ఇది మనిద్దరి కెరీర్లో అత్యంత భారీ చిత్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement