సిగ్నల్ అట్ 11.30 ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: అలర్ స్టూడియోస్ పతాకంపై మలర్‌విళి నటేశన్, డా.శివానిసుబ్రమణి కలసి నిర్మిస్తున్న చిత్రం సిగ్నల్ అట్ 11.30.మలర్ విళి నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ముఖ్యపాత్రల్లో భవ్య పత్రికా, పూజిత పొన్నాడ, జయప్రకాష్, మునీష్‌కాంత్ నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాతలు పేర్కొంటూ కాలం ఎవరి కోసం ఆగదు అన్న అబ్దుల్ కలాం వ్యాఖ్యల ఆధారంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇది అని పేర్కొన్నారు. సిగ్నల్ అట్ 11.30 చిత్ర కథను వినగానే నచ్చిందన్నారు. సంతోష్ ప్రతాప్ అయితే ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారన్నారు. ఈచిత్రానికి డీ ఇమాన్ సంగీతాన్ని అందించారని, ఆయన సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చుందని చెప్పారు. మలర్‌విళి నటేశన్ పేర్కొంటూ రాత్రి 11.30 గంటలకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కథానాయకుడికి ఎదురైన అనూహ్య అనుభవం అతని జీవిత దిశను ఎలా మార్చింది అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. దీనికి రాజాపట్టాచార్జీ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన చెప్పారు.


