లో ఓల్టేజి సమస్యతో పనిచేయని మరమగ్గాలు
–విద్యుత్ గ్రీవెన్స్‌లో నేత కార్మికుల ని‘వేదన’
తిరుత్తణి: బుచ్చిరెడ్డిపల్లెలో లో–ఓల్టేజి సమస్య పరిష్కరించాలని నేత కార్మికులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తిరుత్తణిలోని డివిజినల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ శేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించారు. సబ్ డివిజన్ వ్యాప్తంగా నుంచి విద్యుత్ వినియోగదారులు, రైతులు, నేత కార్మికులతోపాటు ప్రజలు విద్యుత్ సమస్యలపై వినతిపత్రాలు అందజేసారు. బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన నేత కార్మికులు మాట్లాడుతూ, నెల రోజులుగాలో తమ గ్రామంలో ఓల్టేజి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో మరమగ్గాలు పనిచేయక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నట్టు నివేదించారు. కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి లో ఓల్టేజి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజినల్ ఇంజినీర్ మురగ భూపతి, సహాయ ఇంజినీర్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు


