● ఆస్పత్రిలో చికిత్స ● సీఎం పరామర్శ
జారి పడ్డ మంత్రి
దురై మురుగన్
సాక్షి, చైన్నె : డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్ (87) ఇంట్లో జారి పడ్డారు. ఆయన్ని చైన్నెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వయోభారం దృష్ట్యా దురై మురుగన్ తరచూ ఆస్పత్రికి వెళ్లి సాధారణ పరీక్షలు, చికిత్స చేసుకోవడం తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ముఖ్యమైన కార్యక్రమాల నిమిత్తం మాత్రమే ఇంటి నుంచి బయటకు వస్తున్నారు.ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో జారి కింద పడ్డారు. ఆయన్ని కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాలికి, చేతికి గాయం కావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో ఉదయాన్నే సీఎం స్టాలిన్, ఆస్పత్రికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు. అస్వస్థతకు కారణాలు, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


