స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
పళ్లిపట్టు: వాహనాలు అధిక వేగంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రాస్తారోకో చేశారు. దీంతో పొదటూరుపేటలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పొదటూరుపేట టౌన్ పంచాయతీలో కాంచీపురం వీధి మార్గంలో వందలాది వాహనాలు అధిక వేగంతో వెళుతుంటాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహించిన ఆ ప్రాంతం వాసులు మంగళవారం స్పీడ్ బ్రేకర్లు ఉర్పాటు చేయాలని రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ ఆగిపోవడంతో అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని, రోడ్డును విస్తరిస్తామని హామీ ఇవ్వడంతో గంటపాటు నిర్వహించిన రాస్తారోకోను విరమించారు.


