మహిళా విద్యే..
సీఎం స్టాలిన్
7.5 శాతం రిజర్వేషన్ విస్తరణ
వృద్ధ జంటలకు ప్రత్యేక గౌరవం
సీఎం నేతృత్వంలో శుభప్రద వస్తువులతో సారె పంపిణి
కొళత్తూరులో డీసీపీ కార్యాలయం
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ క్రిస్టియన్ హయ్యర్ ఎడ్యుకేషన్, మహిళా క్రైస్తవ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సీఎంకు కృతజ్ఞత కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. రూ. 3.45 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న బ్యాడింటన్ మైదానం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే విద్యార్థినులతో మాట్లాడారు. ప్రపంచం మీ చేతుల్లో పథకం ద్వారా ల్యాప్ టాప్‌లను పొందిన వారితో ముచ్చటించారు. మహిళా అధ్యాపకులతో మాట్లాడారు. అనంతరం జరిగిన సభలో సీఎం స్టాలిన్ ప్రసంగించారు.
తాను కూడా ఎంసీసీ పూర్వ విద్యార్థినని గుర్తుచేసుకుంటూ తాజాగా ఎంసీసీ నుంచి డబ్ల్యూసీసీకి రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. విద్య మనిషిని మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చగల శక్తి కలిగిందన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మహిళా విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు విశేష ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కళాశాలలో చేరే విద్యార్థినులకు నెలకు రూ.1000 అందించే పుదుమై పెన్ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా లాభపడుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యలో మహిళల నమోదు 34 శాతం పెరిగిందని, దాదాపు 8 లక్షల మంది విద్యార్థినులు ప్రయోజనం పొందారని చెప్పారు. మైనారిటీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటూ వస్తున్నదని వివరించారు. అన్ని రకాల పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని మరిన్ని పథకాల ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కష్టపడకుండా ఏమీ దక్కదని, కష్టపడకుండానే దరిచేరేవన్ని త్వరితగతిన దూరమవుతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.


