కోడెగిత్తల జోరు –యువత హుషారు
వెదురుకుప్పం : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వెదురుకుప్పం మండలంలోని సీఆర్‌కండ్రిగలో జల్లికట్టును ఘనంగా నిర్వహించారు. రంకెలేస్తూ దూసుకుపోతున్న కోడెగిత్తలను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహం చూపారు. ఇక్కడికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పలువురు తమ పశువులను తీసుకువచ్చారు. నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి ఉసిగొల్పారు. రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న ఎద్దులను నిలువరించి పలకలు సాధించేందుకు యువకులు విశ్వ ప్రయత్నం చేశారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి తమ ప్రతాపాన్ని చూపారు. పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పరుగులు తీశాయి.
కోడెగిత్తల జోరు –యువత హుషారు


