జాతీయ స్థాయి హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

జాతీయ స్థాయి హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన

జాతీయ స్థాయి హ్యాకథాన్‌కు అనూహ్య స్పందన

● విజేతలకు బహుమతుల ప్రదానం

కొరుక్కుపేట:డెవలపర్‌ నెట్‌వర్క్‌ స్పేస్‌ (డీఎన్‌ఎస్‌ ) క్లబ్‌తో కలిసి వడపళని క్యాంపస్‌లోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైనన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ స్థాయి హ్యాకథాన్‌ అయిన హ్యాక్‌ఎలైట్‌ 2026కు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం కంప్యూటర్‌ సైనన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ గోల్డా దిలీప్‌ స్వాగత ప్రసంగంతో హ్యాకథాన్‌ ఆరంభించారు. వైస్‌–ప్రిన్సిపాల్‌ (అకాడెమిక్స్‌ – ప్లేస్‌మెంట్స్‌) డాక్టర్‌ సి. గోమతి ప్రత్యేక ప్రసంగం చేశారు. జెన్‌క్సాయ్‌ అండ్‌ జెన్‌వాయిస్‌ వ్యవస్థాపకుడు హరివికాష్‌ భక్తవత్సలం అతిథిగా పాల్గొన్నారు. వెర్నూర్‌ వ్యవస్థాపకులు స్వాతిష్‌ జి, అవెంట్రో టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి సారా సామ్రిన్‌లతో కూడిన బాహ్య జడ్జింగ్‌ ప్యానెల్‌ గా వ్యవహరించి విజేతలకు ప్రకటించారు.ముగింపు వేడుకల్లో ఎస్‌ ఆర్‌ ఎం డీన్‌ (ఎఫ్‌ఈటీ) డాక్టర్‌ సి.వి.జయకుమార్‌ , స్పేస్‌ముష్‌ వ్యవస్థాపకుడు శివరామన్‌ ఎస్‌ పాల్గొని విధ్యర్డులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు.ఈశ్వరి ఇంజనీరింగ్‌ కళాశాల మొదటి స్థానాన్ని కై వసం చేసుకుని రూ.15,000 నగదు బహుమతిని అందుకుంది. రెండవ స్థానాన్ని ఎస్‌ఆర్‌ కేటీఆర్‌ రూ.10,000 బహుమతి లభించింది. మూడవ స్థానాన్ని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల , ఎస్‌ ఆర్‌ ఎం జె టి ఆర్‌ పంచుకున్నాయి, ప్రతి సంస్థకూ రూ.5,000 నగదు బహుమతి చొప్పున అందజేశారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement