యువకుడి అరెస్ట్‌ –నాటుబాంబులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అరెస్ట్‌ –నాటుబాంబులు స్వాధీనం

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

యువకుడి అరెస్ట్‌ –నాటుబాంబులు స్వాధీనం

యువకుడి అరెస్ట్‌ –నాటుబాంబులు స్వాధీనం

తిరువళ్లూరు: మామ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాటుబాంబులతో సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ కుల్లశీను. ఇతడిని ప్రత్యర్థులు గత జూలైలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ప్రవీణ్‌ (21) విక్కీ(20), ఆకాష్‌(19)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో కుల్లశీను హత్యకు ప్రతీకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతడి బావమరిది అంబ్రోస్‌ నాటు బాంబులతో మనవాలనగర్‌లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు శుక్రవారం రాత్రి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఆసమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అంబ్రోస్‌ (21)ను పోలీసులు విచారణ చేయగా, అతడి వద్ద నాలుగు నాటుబాంబులు వున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో తన మామ హత్య చేసిన వారిపై బాంబులు వేసి హత్య చేయాలని చెప్పడంతో అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement