తరలి వచ్చిన తారా లోకం
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, బుల్లితెర అవార్డులు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డుల వేడుక శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కలైవానర్ అరంగం వేదికగా జరిగింది. తమిళ తారాలోకం తరలి వచ్చి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమిళ చిత్ర అవార్డుల వేడుక జరగలేదు. తాజాగా డీఎంకే ప్రభుత్వం ఎట్టకేలకు అవార్డుల ప్రదానోత్సవానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా 2016 నుంచి 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 2014 నుంచి 2022 సంవత్సరాలకు స్మాల్ స్క్రీన్ అవార్డులు, 2015 – 2016 నుంచి 2021 – 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులను గత నెల ప్రకటించారు. వీరికి అవార్డుల ప్రదానోత్సం కోలాహలంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో చైన్నెలోని కలైవానర్ అరంగం వేదికగా జరిగింది.
అవార్డుల ప్రదానం
2016 నుంచి 2022 వరకు ఆయా సంవత్సరాల వారీగా విడుదల చేసిన జాబితాలోని ఉత్తమ నటులు, నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హాస్య నటులు, దర్శకులు, ఉత్తమ చిత్రాలు, కేటగిరిలకు ఎంపికై న వారికి అవార్డులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సమాచారమంత్రి స్వామినాథన్, దేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు అవార్డులను అందజేశారు. అలాగే, గాయని సుశీలకు కలైంజ్ఞర్ స్మారక అవార్డును అందజేశారు. ఉత్తమ చిత్రాలకు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష, మూడవ బహుమతి రూ.75 వేలు అందజేశారు. ప్రత్యేక బహుమతి రూ.75 వేలు, మహిళలను సానుకూల దృక్పథంలో చిత్రీకరించిన చిత్రానికి రూ. 1.25 లక్షల ప్రత్యేక బహుమతిని అందించారు. ఉత్తమ నటుడు, నటి , ఉత్తమ సాంకేతిక కళాకారులకు ఇతర విభాగాలకు పది గ్రాముల బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అవార్డులను ఽనటీనటులు సూర్య, కార్తీ, శివకార్తికేయన్, ధనుష్, విక్రమ్‌ప్రభు, విష్ణు విశాల్, ఆర్ పార్థిబన్, కీర్తిసురేష్, సాయిపల్లవి, ఐశ్వర్యరాజేష్, ఆండ్రియా, ఊర్వశి, తుషారా విజయ్, యోగిబాబు, అమీర్, సముద్రఖని, మారిసెల్వరాజ్, కోవై సరళ, శ్రీరంజని, అర్జున్‌దాస్ తరలివచ్చి అవార్డులను అందుకున్నారు. ఇందులో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్‌కు పొన్నియన్ సెల్వన్‌చిత్రానికిగాను ఉత్తమ అవార్డు అందుకున్నారు. పొన్నియన్ సెల్వ ల్యాండ్ మార్కు చిత్రం అని, దక్షిణ భారత దేశంలో అత్యంత ముఖ్య కథనం అని పేర్కొంటూ, ఇందుకు అవార్డు రావడం ఆనందంగా ఉందని ఏఆర్ రెహ్మాన్ తెలిపారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి ప్రసంగిస్తూ, ఈ అవార్డులపై మొదలైన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలోని జ్యూరీ కమిటీ అర్హులైన వారిని ఎంపికచేసిందని వివరించారు.
తరలి వచ్చిన తారా లోకం
తరలి వచ్చిన తారా లోకం
తరలి వచ్చిన తారా లోకం
తరలి వచ్చిన తారా లోకం
తరలి వచ్చిన తారా లోకం


