వెల్నెస్ బలోపేతమే లక్ష్యంగా ట్రాకథాన్
సాక్షి, చైన్నె: ప్రివెంటివ్ వెల్‌నెస్, కమ్యూనిటీ ఫిట్‌నెస్‌పై నిబద్ధతను చాటే విధంగా ఎంజీఎం హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ట్రాకథాన్ 2026 విజయవంతంగా నిర్వహించారు. చైన్నె రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెంట్‌కు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. ఈ ట్రాక్ ఆధారిత రన్నింగ్ ఈవెంట్‌లో 370కు పైగా రిక్రియేషనల్ రన్నర్లు, 240కి పైగా ఎండ్యూరెన్స్ అథ్లెట్లు పాల్గొని, చైన్నెలోని అత్యంత కఠినమైన రన్నింగ్ పోటీలలో ఒకటిగా ట్రాకథాన్‌ను నిలిపారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా రన్నర్లు 400 మీటర్ల ట్రాక్‌లో పదేపదే పరుగెత్తుతూ, తమ శారీరక సహనం, వ్యూహాత్మక పేసింగ్, హైడ్రేషన్ క్రమశిక్షణ, మానసిక ధైర్యాన్ని పరీక్షించుకున్నారు. వేగం, సహనం, పట్టుదలతో కూడిన ఉత్కంఠభరిత పోరాటం అనంతరం సీఆర్ టవర్ ట్విస్టర్స్ (అన్నా నగర్) విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది.ఈ ట్రోఫీని ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ – సీనియర్ కన్సల్టెంట్ (ఇంటర్నల్ మెడిసిన్) డా. స్వామికన్ను ఎం. చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రేస్ డైరెక్టర్ డా. లక్ష్మీ సుందర్ , చైన్నె రన్నర్స్ అధ్యక్షుడు యాసిర్ సుల్తాన్ పాల్గొన్నారు.


