ప్రేమికుల సందడి | - | Sakshi
Sakshi News home page

ప్రేమికుల సందడి

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

ప్రేమ

ప్రేమికుల సందడి

జోరుగా గులాబీల విక్రయం పార్కుల, బీచ్‌ల వద్ద కట్టుదిట్టంగా భద్రత

సాక్షి, చైన్నె: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పార్కులు, బీచ్‌లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లలో ప్రేమ జంటలు సందడి చేశాయి. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు నిరసనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక, ప్రేమికులకు గట్టి భద్రత కల్పించే విధంగా అన్ని చోట్ల పోలీసులు నిఘాతో వ్యవహరించారు. వివరాలు.. ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవం పండుగ రోజు అన్న విషయం తెలిసిందే. ఈ రోజును ఆదరించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లు మరి కొందరు. ఆదరణలు, వ్యతిరేకతలతో పని లేకుండా తమ ప్రేమకు అడ్డెవరు అనుకునే వారూ ఉన్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రేమికుల దినోత్సవాన్ని సందడిగా జంటలు జరుపుకున్నాయి. పార్కులు, బీచ్‌లు తదితర ప్రాంతాలలో ప్రేయసీ, ప్రియులతో కలసి వచ్చే ప్రేమికుల కోసం పోలీసులు గట్టి భద్రత కల్పించక తప్పలేదు. వ్యతిరేకులు, నిరసన కారుల నుంచి ప్రేమకుల్ని రక్షించే బాధ్యతను తమ భుజాన వేసుకున్నట్టుగా పోలీసులు అన్ని నగరాలలో ముందుకెళ్లారు. చైన్నెలో మెరీనా, గాంధీ బీచ్‌, పట్టినం బాక్కం బీచ్‌, బీసెంట్‌నగర్‌, బీచ్‌లు, గిండీలో చిల్డ్రన్స్‌ పార్కు, వండలూర్‌ జూతో సహా పర్యాటక కేంద్రాలలో ప్రేమ జంటలు చక్కర్లు కొట్టాయి. వినోద కేంద్రాలు, బీచ్‌లలో ప్రేమ జంటలు సందడి చేశాయి. ఒకరికొకరు కానుకల్ని సమర్పించుకున్నారు. రాష్ట్రంలోని ప్రకృతి రమణీయతకు నిలయంగా ఊటీ, కొడైకెనాల్‌లో అయితే, ఎక్కడ చూసినా కొత్త జంటలు, ప్రేమ జంటలు సందడి చేశాయి. ప్రేమ వివాహం చేసుకున్న కొత్త జంటల ఆనందానికి అవధులు లేవు. ఇక, రోజా పువ్వులు, బొకేల విక్రయాలు జోరుగా జరిగాయి. ప్రేమికుల దినోత్సవం వేళ తిరునల్వేలి జిల్లా వళ్లియూరులో జయకుమార్‌ అనే వ్యక్తి తన టీ దుకాణంలో ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించారు. మూడు రోజుల పాటుగా తన దుకాణంలో టీ ధర రూ. 1 అని బోర్డు పెట్టేశాడు. ఇక, ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు జరగ్గా పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.

బీచ్‌లో ప్రేమ జంటల సందడి

పార్కుల్లో ప్రేమ జంటల సందడి

ప్రేమికుల సందడి 1
1/4

ప్రేమికుల సందడి

ప్రేమికుల సందడి 2
2/4

ప్రేమికుల సందడి

ప్రేమికుల సందడి 3
3/4

ప్రేమికుల సందడి

ప్రేమికుల సందడి 4
4/4

ప్రేమికుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement