వృషభ వాహనంపై విహారం
ఏర్పేడు : గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయంలో శుక్రవారం ఉదయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లు వృషభ వాహనంపై పుర వీధుల్లో విహరించారు. ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు, ఈవో రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు వేడుకగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ ప్రత్యేక అభిషేక పూజలు చేసి సాయంత్రం స్వామి, అమ్మవార్లను కామధేను వాహనంపై విహరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది.


