ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా వెట్రి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా వెట్రి

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా వెట్రి

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా వెట్రి

తమిళసినిమా: 8 తోట్టాక్కల్‌ చిత్రం ఫేమ్‌ వెట్రి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పరేడ్‌. హైదరాబాద్‌కు చెందిన అక్షిత, చాందిని తమిళరసన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు బాలాజీ శక్తివేల్‌, సింగం పులి, శరవణ సుబ్బయ్య, రబ్బర్‌ బంతు జాన్సన్‌ దివాకర్‌, కోడంగి వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్‌ హౌస్‌ జైన్‌ క్రియేషన్స్‌ సంస్థలతో కలిసి మహేందర్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెబ్‌ చిత్రం ఫేమ్‌ హారూన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయినట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు వెట్రి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు చెప్పారు. ఆయన తన వృత్తిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఆయన కుటుంబం ఎలాంటి బాధింపులకు గురైంది, అందులోంచి ఎలా బయట పడగలిగారు తదితర ఆసక్తికరమైన అంశాలతో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా పరేడ్‌ చిత్రం ఉంటుందని తెలిపారు. జాన్‌ రాబిన్స్‌ సంగీతాన్ని, కేవీ.కిరణ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలోని పోలీసులకు సంబంధించిన ఒక పాటను దర్శకుడు అరుణ్‌ రాజా కామరాజ్‌ పాడడం విశేషమన్నారు. కెప్టెన్‌ ఎంపీ ఆనంద్‌, కేఎస్‌కే సెల్వకుమార్‌ నిర్మాణ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను చైన్నె, కోవై, కోడైకెనాల్‌ ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement