విజయ్‌కాంత్‌ ఆఫీస్‌ నుంచే నా పయనం | - | Sakshi
Sakshi News home page

విజయ్‌కాంత్‌ ఆఫీస్‌ నుంచే నా పయనం

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

విజయ్‌కాంత్‌ ఆఫీస్‌ నుంచే నా పయనం

విజయ్‌కాంత్‌ ఆఫీస్‌ నుంచే నా పయనం

తమిళసినిమా: ప్రతిభ ఉంటే ఈ రోజు కాకున్నా, రేపు అయినా వెలుగులోకి వస్తుంది. ఇది ఎవరికై నా వర్తిస్తుంది. అలా వెలుగులోకి వచ్చిన దర్శకుడు ఆర్‌.మహాలక్ష్మీ మురుగన్‌. ఈయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఎల్‌ఎస్‌ఎస్‌ ( లవ్‌ షేర్‌ సబ్‌స్కైబ్‌). జేబీ ఫిలింస్‌ పతాకంపై పి.రఘు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటుడు ఆదవ్‌ కృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయనకు జంటగా సిమ్రాన్‌ అద్వాని నటించారు. అశ్వమిత్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 20న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని భరణి స్టూడియోలో నిర్వహించారు. ఈ చిత్రంలోని ప్రమోషన్‌ పాటను దర్శకుడు చరణ్‌ రాయడం విశేషం. దర్శక, నిర్మాత కదిరేశన్‌, నటుడు ఇళవరసు, బక్స్‌, మేనేజర్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్రన్‌ ఆడియోను ఆవిష్కరించారు. ఆదవ్‌ కృష్ణ మాట్లాడుతూ తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆర్‌.మహాలక్ష్మీ మురుగన్‌కు దన్యవాదాలు అన్నారు. చిత్ర దర్శకుడు ఆర్‌. మహాలక్షీ మురుగన్‌ మాట్లాడుతూ ఊరులో మిషన్‌ కుట్టుకుంటూ నాటకాలు ఆడి, కథలను రాసేవాడినన్నారు. అలాంటి తన ఆసక్తిని ప్రోత్సహించే విదంగా తన తండ్రి చైన్నెకి పంపించారన్నారు. అలా తాను నటుడు విజయ్‌కాంత్‌ కార్యాలయంలో చేరినట్లు చెప్పారు. అక్కడ నుంచే తన సినీ పయనం మొదలలైందన్నారు. విజయ్‌కాంత్‌, ప్రేమలత తనుకు ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఒక మంచి ప్రేమ కథా చిత్రాన్ని చేశామని చెప్పారు. అందుకు యూనిట్‌ సభ్యులందరూ ఎందగానో సహరించారని చెప్పారు. లవ్‌ షేర్‌ సబ్‌స్రైబ్‌ చిత్రం యూత్‌ను అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement