సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌ నుంచి ఫస్ట్‌లుక్‌ | - | Sakshi
Sakshi News home page

సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌ నుంచి ఫస్ట్‌లుక్‌

Feb 12 2026 1:21 PM | Updated on Feb 12 2026 1:21 PM

సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌ నుంచి ఫస్ట్‌లుక్‌

సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌ నుంచి ఫస్ట్‌లుక్‌

తమిళసినిమా: లక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై ఇసక్కి కార్వన్నన్‌ నిర్మిస్తున్న చిత్రం సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌. రచయిత, దర్శకుడు వెట్రిమారన్‌ శిష్యుడు సుఖాగా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఇసక్కి కార్వన్నన్‌, ఎంఎస్‌.భాస్కర్‌, ఇళవరసు, మూనార్‌ రమేష్‌, దర్శకుడు సుబ్రహ్మణియ శివ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటూ పూజా మోహన్‌ రాజ్‌, సుధా నంది, సూర్జిత్‌ గోపీనాథ్‌, విద్యా విజయకుమార్‌, యశ్వంత్‌, సంతాన లక్ష్మి, మీనాక్షి అయ్యర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి మార్టిన్‌ డాన్‌ రాజ్‌ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక సాధారణ ప్రజల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే కథా చిత్రంగా సైలప్పన్‌ సైకిల్‌ మార్ట్‌ ఉంటుంది. దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు వెట్రిమారన్‌ విడుదల చేశారు. చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలు చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement