మైనర్లకు సెల్‌ఫోన్‌ నిషేధించాలి | - | Sakshi
Sakshi News home page

మైనర్లకు సెల్‌ఫోన్‌ నిషేధించాలి

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

మైనర్లకు సెల్‌ఫోన్‌ నిషేధించాలి

మైనర్లకు సెల్‌ఫోన్‌ నిషేధించాలి

తిరువళ్లూరు: 16 సంవత్సరాలలోపు పిల్లలు సెల్‌ఫోన్‌ వాడకుండా నిషేధిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ రీజినల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ సుగుణసింగ్‌ సూచించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే పాఠశాల 12వ వార్షిక క్రీడోత్సవం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. సంస్థల ఉపాధ్యక్షుడు ఆర్‌ఎం కిషోర్‌ ప్రారంభోపన్యాసం చేయగా, కార్యదర్శి యలమంచి ప్రదీప్‌ అతిధిలను పరిచయం చేశారు. ముఖ్యఅతిథిగా సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ రీజినల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ సుగుణసింగ్‌ హాజరై క్రీడా ఉత్సవాలను ప్రారంబించారు. అనంతరం విద్యార్దులు చేపట్టిన మార్చ్‌పాస్ట్‌ను పరిశీలించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు, మెడల్స్‌, సర్టిఫికెట్‌లను అందజేశారు. గత విద్యాసంవత్సరంలో పదవ, ప్లస్‌–2 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ. 1.54 లక్షల నగదు బహుమతులను ఆయన అందజేశారు. దీంతో పాటూ జాతీయ స్థాయిలో ఇటీవల జరిగిన అర్చురీ(విల్లువిద్య) పోటీల్లో పాల్గోన్న బాలికకూ ప్రోత్సాహ నగదు కిందు రూ. 25 వేలు అందజేశారు. అనంతరం ఆయన విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ తదితర వాటికి బానిసై భవిష్యత్‌ పాడుచేసుకోవద్దని సూచించారు. 16 సంవత్సరాల లోపు పిల్లలు సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియా వాడొద్దన్న చట్టాన్ని పలు దేశాలు రూపొదించి అమలు చేస్తున్నాయి. మనదేశంలోనూ ప్రత్యేక చట్టాన్ని రూపొంచాలన్నారు. చాలా మంది క్రికెటర్‌ సచిన్‌, పుట్‌బాట్‌స్టార్‌ రొనాల్డోను రోల్‌మాడల్‌గా తీసుకుంటారు. తాను మాత్రం సచిన్‌ను, రోనాల్డోను ప్రపంచస్థాయి స్టార్‌లుగా తీర్చిదిద్దిన వారి కోచ్‌లు బోలోనీ, రమాకాంత్‌ అర్చురేకర్‌లను ఆదర్శంగా తీసుకుని ఐపీఎస్‌ సాధించానన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సలహాదారులు ఎంఎస్‌ పళణిస్వామి, మనోహరన్‌, విద్యార్దులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement