ఇప్పటికీ నెరవేరని కోరిక ఉంది! | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నెరవేరని కోరిక ఉంది!

Feb 12 2026 1:21 PM | Updated on Feb 12 2026 1:21 PM

ఇప్పటికీ నెరవేరని కోరిక ఉంది!

ఇప్పటికీ నెరవేరని కోరిక ఉంది!

తమిళసినిమా: సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్లుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. తమిళంలో విజయ్‌, రజనీకాంత్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్‌ వంటి టాప్‌ స్టార్స్‌ తో జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగారు. ఎక్కువగా గ్లామరస్‌ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత 25 ఏళ్లుగా నాట్‌ అవుట్‌గా కొనసాగుతున్న శ్రియ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. అదేమాటంటే నాట్య కళాకారిణి పాత్ర అని చెప్పారు. ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement