సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ

సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ

సాక్షి, చైన్నె: చైన్నెలో సమానత్వాన్ని చాటే విధంగా 3వ ఎడిషన్‌గా పురుష అల్లీషిప్‌ సినర్జీ సమ్మిట్‌ నిర్వహణ ర్యాలీని శనివారం నిర్వహించారు. చైన్నెలోని టైడల్‌ పార్కు ఆడిటోరియంలో అవతార్‌ హ్యుమన్‌ క్యాపిటల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన పౌరులు, పాఠశాల విద్యార్థులు,కళాశాల యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఏహెచ్‌సీటీ అవతార్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ సౌందర్య రాజేష్‌ మాట్లాడుతూ, ఎంఐటీఆర్‌, ఎంఏఎస్‌ఎస్‌ ద్వారా బాలురు, యువకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వ్యక్తిగత బాధ్యతలు, ఆలోచనలు, న్యాయం, గౌరవం, కుటుంబాలు, కార్యాలయాలు, సమాజాలను బలోపేతం చేయడం , లింగ సమానత్వం, సమాజంలో సమానత్వానికి చురుకుదనం, మిత్రులుగా కలసి మెలిసి ఉండాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరించినట్టు పేర్కొన్నారు. ర్యాలీతోపాటుగా అవగాహన కార్యక్రమం, వివిధ పోటీలనుసైతం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్సన్‌ ఫ్యాషన్‌ ఎండీ డాక్టర్‌ శామ్‌ పాల్‌, ఏహెచ్‌సీటీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌బాల సుబ్రమణియన్‌, అవతార్‌ సీఓఓ ఉమాశంకర్‌ కందస్వామితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement