తిరుత్తణిలో ఆటోడ్రైవర్ల ఆందోళన
తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయానికి ఆటోలకు అనుమతి నిరాకరించడంతో ఆటోడ్రైవర్లు ఆలయ అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించడంతో ఆటోడ్రైవర్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహాశివరాత్రి, వారాంతపు సెలవులు, శుభముహూర్తాలు కావడంతో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో కొండపైకి ఆటోలకు ఆలయ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆదివారం కొండ ఆలయానికి ఆటోలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన ఆటోడ్రైవర్లు ర్యాలీగా వెళ్లి ఆలయ జాయింట్ కమిషనర్ ఆలయం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం వారందిరనీ విడిచిపెట్టారు.


