నిర్మాణ పనులను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

వేలూరు: వేలూరు జిల్లాలో ప్రస్తుతం నిర్మిస్తున్న కట్టడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పంచాయతీ శాఖ మంత్రి ఏవా వేలు అన్నారు. వివరాలు.. వేలూరు జిల్లా పెరుమొగై గ్రామ పంచాయితిలో రూ: 46 కోట్లు వ్యయంతో 250 గదులతో కూడిన ప్రభుత్వ కలైంజర్‌ వసతి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఆయన సోమవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. రోజూ పనులను ఇంజినీర్‌లు తనిఖీ చేయాలన్నారు. ప్రస్తుతం 215 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ వసతి భవణం నిర్మించడం జిల్లాకే గర్వ కారణమన్నారు. ప్రస్తుతం మూడు అంతస్తులుగా నిర్మాణ పనులను జరుగుతున్నాయని ఈ పనులను త్వరగా పూర్తి చేసి రాష్ట్ర సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ రాక ముందే పనులను పూర్తి చేయాలన్నారు. ఆయనతో పాటూ మేయర్‌ సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement