రైల్‌రోకోకు యత్నం
తిరువళ్లూరు: కేంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన క్రమంలో గురువారం ఉదయం తిరువళ్లూరులో రైల్‌రోకోకు యత్నించిన 150 మందిని అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరిస్తూ కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరులో బంద్ ప్రభావం కనిపించలేదు. ఆటోలు, బస్సులు యథావిధిగా కొనసాగింది. ఈ క్రమంలో డీఎంకే, వీసీకే, కాంగ్రెస్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూతోపాటు సంఘాలు పెద్దకుప్పం రైల్వేస్టేషన్ వద్ద ఽ ఆందోళన నిర్వహించాయి. కార్మికులకు వ్యతిరేకంగా రూపొందించిన నాలుగు చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే విత్తనాల చట్టంను వెనక్కి తీసుకోవాలని, అణుశక్తి విభాగంలో ప్రైవేటు వ్యక్తులు సంస్థలను అనుమతించకూడదని నినాదాలు చేశారు. అనంతరం రైలురోకోకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు 150 మందిని అరెస్టు చేసి ప్రైవేటు మండపానికి తరలించారు.
డీఎంకే కూటమి ధర్నా
తిరువళ్లూరు: తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని పిలుపు నిచ్చిన క్రమంలో గురువారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు, కాకలూరు, సెవ్వాపేట, తిరువేళాంగాడు, పూందమల్లి, పొన్నేరి, గుమ్మిడిపూండి, ఆవడి, అంబత్తూరుతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌తో పాటు కూటమి నేతలు మద్దతు పలికారు. డీఎంకే ఆధ్వర్యంలో తిరువళ్లూరులో నిర్వహించిన ఆందోళనల్లో స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పూందమల్లిలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, గుమ్మిడిపూండిలో టీజే గోవిందరాజన్, పొన్నేరిలో జిల్లా కన్వీనర్ రమేష్‌రాజ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిరసించడంతోపాటు ఉపాధి హామీ పనులు, విద్య నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు.
మరణంలోనూ వీడని బంధం
అన్నానగర్: కన్యాకుమారి జిల్లాలోని కన్నకోడ్ ప్రాంతానికి చెందిన వర్ కరుణాకరన్ (78) ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్. ఇతని భార్య ఓమన(74) వీరికి పిల్లలు లేరు. బుధవారం సాయంత్రం వృద్ధాప్యం కారణంగా ఓమన అకస్మాత్తుగా మరణించింది. వీరు వివాహమైన్పటి నుంచి సంతోషంగా కలిసి జీవించారు. భార్య మరణాన్ని తట్టుకోలేని కురుణాకరన్ అకస్మాత్తుగా ఊపిరి ఆడక మూర్చపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే అతను కూడా మరణించాడు.
రైల్‌రోకోకు యత్నం


