విచారణైకు దశాబ్దం | - | Sakshi
Sakshi News home page

విచారణైకు దశాబ్దం

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

విచారణైకు దశాబ్దం

విచారణైకు దశాబ్దం

తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో రూపొంది విడుదలైన కొన్ని చిత్రాలు సాధారణంగా కాకుండా ఒక కాలానికి చెందిన గొంతుకగా, సమాజానికి సాక్ష్యాలుగా మారుతాయి. అలాంటి వాటిలో 2016లో విడుదలైన విచారణై చిత్రం ఒకటి. ఆ చిత్రం విడుదలై దశాబ్ద కాలం అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ గురువారం ఉదయం చైన్నెలోని బాలు మహేంద్రన్‌ స్టూడియోలో సమావేశమైంది. తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌, రచయిత చంద్రకుమార్‌, నటుడు దినేష్‌, దర్శక నటుడు సముద్రఖని, శరవణ సుబ్బయ్య, మూనార్‌ రమేష్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, దర్శకుడు తమిళ్‌, ఛాయాగ్రాహకుడు రామలింగం తదితర విచారణై చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. నటుడు ధనుష్‌కు చెందిన వండర్‌ బార్‌ ఫిలిమ్స్‌, దర్శకుడు వెట్రిమారన్‌కు చెందిన గ్రాస్‌ రూట్‌ ఫిలిం కంపెనీ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం రచయిత చంద్రకుమార్‌ రాసిన లాకప్‌ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది అన్నది గమనార్హం. పోలీస్‌ విచారణ పేరుతో జరిగే మానవహక్కులను మీరడం, పోలీసుల క్రూరత్వ చర్యలు, సాధారణ ప్రజల వేదనలు తదితర అంశాలతో సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చి రూపొందించిన చిత్రం విచారణై. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడి తమిళ సినిమా గౌరవాన్ని పెంచింది. ఇలాంటి సాహసంతో కూడిన సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement