నటి వర్సెస్‌ దర్శకురాలు | - | Sakshi
Sakshi News home page

నటి వర్సెస్‌ దర్శకురాలు

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

నటి వ

నటి వర్సెస్‌ దర్శకురాలు

తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. విదేశాల్లో విద్యను అభ్యసించి కోలీవుడ్లో కథానాయకగా పరిచయమైన వరలకి్‌ష్‌ పొడా పొడి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అలా కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈమె ఆ తర్వాత ప్రతి కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి నిలక్షణ నటిగా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు ,మలయాళం భాషల్లో నటిస్తున్నారు. గత ఏడాది ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలస్‌ సత్యదేవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా దర్శకురాలుగా, నిర్మాతగా అవతారం ఎత్తారు. ఈమె తన చెల్లెలు పూజతో కలసి దోశ డైరీస్‌ అని చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించి సరస్వతి అనే పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమెనే దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ ఇటీవలే పూర్తయ్యింది. వరలక్ష్మి ప్రమోషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నటి వర్సెస్‌ దర్శకురాలు పేరుతో చేసిన వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు.. కథానాయకి వరలక్ష్శీరత్‌కుమార్‌, దర్శకురాలు వరలక్ష్మీ మధ్య జరిగే వాగ్వాదం తో సాగే ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది.

నటి వర్సెస్‌ దర్శకురాలు 1
1/1

నటి వర్సెస్‌ దర్శకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement