ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి

ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి

వేలూరు: ప్రతి కుటుంబంలో ఒకరు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ విశ్వనాథన్‌ అన్నారు. వేలూరు వీఐటీ ఆధ్వర్యంలో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు. దీంతో తిరువణ్ణామలై జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఈ పథకాన్ని చాన్స్‌లర్‌ ప్రారంభించి మొత్తం 242 మంది విద్యార్థులకు రూ. 28 లక్షలు చేసే స్కాలర్‌షిప్‌లను అందజేసి ప్రసంగించారు. తన రాజకీయ జీవితానికి తిరువణ్ణామలై జిల్లా ముడి పడి ఉందన్నారు. తాను మూడవ తరగతిలో ఉన్న సమయంలో పెరియార్‌ వైపు చేరాన్నారు. 1967వ సంవత్సరంలో అన్నా యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆ సమయంలో సుమారు 25 మంది యువకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చిందని అందులో తాను ఒకరిని అన్నారు. ఉత్తర ఆర్కాడు జిల్లాలో 75 లక్షల మంది జనాభా ఉన్నారని బారత దేశంలో ఉన్నత విద్య నమోదు రేటు 28 శాతంగా ఉందన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో 65 నుంచి వంద శాతంగా ఉందన్నారు. తమిళనాడు 50 శాతంలో మొదటి స్థానంలో ఉందని కేరళ రెండవ స్థానంలో ఉందన్నారు. అందరికీ ఉన్నత విద్య అందజేయాలనే ఉద్దేశంతోనే అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు ఈ స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి మాట్లాడుతూ ఇండియాలోనే ఉన్నత విద్యలో రికార్డు సాధించిన రాష్ట్రం ఇది . అఖిల భారత సగటు కంటే 50 శాతం ఎక్కువగా తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమయంలో రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అరుణై మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ ఈవీవీ కంబన్‌, మాజీ మంత్రులు అగ్రి క్రిష్ణమూర్తి, సేవూరు రామచంద్రన్‌, అందరికీ ఉన్నత విద్యా పథకం కార్యదర్శి లక్ష్మణన్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సుందర్‌రాజ్‌, ట్రస్టీ కుమరేషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement