వృద్ధ దంపతులకు సత్కారం
తిరుత్తణి: హిందూ దేవాదాయ శాఖ ద్వారా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతులకు పట్టు వస్త్రాలు, పండ్లు, పలహారాలు, విభూది ప్రసాదాలతో సత్కరించాలని అసెంబ్లీలో మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు. దీంతో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ద్వారా వృద్ధ దంపతులను గౌరవించే విధంగా ఆలయం ద్వారా ప్రకటన విడుదల చేశారు. 50 వృద్ధ దంపతులను ఎంపిక చేశారు. కొండ ఆలయంలోని కావడి మండపంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న వృదఅధ దంపతులు వారి కుటుంబీకులతో పాల్గొన్నారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టీలు సురేష్‌బాబు, నాగన్ తదితరులు వృద్ధ దంపతులకు పట్టు వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమ, విభూది, సిల్వర్ ప్లేట్లు సహా రూ. 2,500 విలువైన వస్తువులు పంపిణీ చేసి గౌరవించారు.


