ఉచిత ఇంటి పట్టాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఉచిత ఇంటి పట్టాల పంపిణీ

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

ఉచిత ఇంటి పట్టాల పంపిణీ

ఉచిత ఇంటి పట్టాల పంపిణీ

తిరుత్తణి: పట్టణ శివారులో మూడు దశాబ్దాలుగా నివాశముంటున్న 20 కుటుంబీకులకు ఎమ్మెల్యే చంద్రన్‌ ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. తిరుత్తణి శివారులోని కార్తికేయపురం పంచాయతీలోని పీటీ పుధూర్‌ గ్రామంలోని అరుంధతీ కాలనీలో 40కి పైగా కుటుంబీకులు నివాశముంటున్నారు. పట్టణ శివారులో పోరంబోకు స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్న వారికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అయితే పట్టణ శివారులో ధర ఎక్కువగా వున్నందున ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి వీలుకాక అధికారులు చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వ ఆర్ధిక సాయం పొందలేక అరుంధతీ కాలనీ కుటుంబీకులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చంద్రన్‌ ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి అర్హులైన 20 కుటుంబాలకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకున్నారు. శుక్రవారం తహసీల్దార్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రన్‌ పాల్గొని అర్హులకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి హారతి, ఆర్‌ఐ మణిభారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement