అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

అన్నా

అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన

తిరువళ్లూరు: ఉపాధి పథకాన్ని రద్దు చేస్తారనే అబద్ధపు ప్రచారం చేస్తున్న డీఎంకే తీరును ఖండిస్తూ తిరువళ్లూరు జిల్లాలోని యూనియన్‌ కేంద్రాల్లో అన్నాఈఎంకే కూటమి నేతలు ఆందోళన చేశారు. కడంబత్తూరు, పూండి, తిరువేళాంగాడులో జరిగిన ఆందోళనకఉ మాజీ మంత్రి రమణ అధ్యక్షత వహించారు. గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనియన్‌లో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌, పొన్నేరి, మీంజూరులో జరిగిన ఆందోళనకు జిల్లా కన్వీనర్‌ శిరునియం బలరామన్‌ నేతృత్వం వహించారు.

పూందమల్లి, తిరువేర్కాడులో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మణిమారన్‌, ఆవడి, తిరునిండ్రవూర్‌లో జరిగిన ఆందోళనకు మాజీ మంత్రి అబ్దుల్‌రహీం, అంబత్తూరులో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే అలెగ్జాండర్‌ అధ్యక్షత వహించారు. ఉపాధి బిల్లులు బకాయిలు లేకపోయినా వున్నట్టు చూపించి కేంద్రప్రభుత్వం ప్రజలను అసంతృప్తి కలిగేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంధ్ర ప్రభుత్వంతో సఖ్యతగా వుంటూ నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన సీఎం స్టాలిన్‌ వారితో ఘర్షణ పడి పరువును బజారున పడేశారని విమర్శించారు. ఈ ఆందోళనలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉపాధి నిర్వీర్యానికి నిరసనగా ఆందోళన

తిరుత్తణి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 125 రోజుల ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే కూటమి పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం బీడీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. తిరుత్తణిలోని బీడీఓ కార్యాలయం వద్ద మండల అన్నాడీఎంకే కార్యదర్శులు అత్తుళూరు రవి, కవిచంద్రన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, పీఎంకే, పురట్చి భారతం సహా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. అన్నాడీఎంకే ఆర్గనైజింగ్‌ కార్యదర్శి హరి, మాజీ మంత్రి రమణ పాల్గొని గ్రామీణుల ఉపాధి పథకం నిర్వీర్యం చేసే డీఎంకే ప్రభుత్వ కుట్రలకు నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే పళ్లిపట్టు మండల కార్యదర్శులు టీడీ.శ్రీనివాసన్‌, కృష్ణమనాయుడు, రవి ఆధ్వర్యంలో బీడీఓ కార్యాలం వద్ద మహాధర్నా చేశారు.

అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన 1
1/1

అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement