‘చూశారా? బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’ | Robert Kiyosaki warning central banks selling bonds, buying gold | Sakshi
Sakshi News home page

‘చూశారా? బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’

Jun 1 2026 1:52 PM | Updated on Jun 1 2026 2:16 PM

Robert Kiyosaki warning central banks selling bonds, buying gold

ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

“ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement