సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత.. రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇందులో పాత ఆలోచన vs కొత్త ఆలోచన అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నా ఆందోళన అని మొదలు పెట్టిన కియోసాకి పాత ఆలోచన vs కొత్త ఆలోచన అని చెబుతూ.. ధనిక మరియు పేద మధ్య అంతరం ఇలా అవుతుందని వివరించారు. పాత ఆలోచనాపరులు, కొత్త ఆలోచనాపరులు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు.
పాత ఆలోచనాపరులు
1: పాఠశాలకు తిరిగి వెళ్లండి
2: మరింత కష్టపడి పని చేయండి
3: నకిలీ డబ్బును ఆదా చేయండి
4: పదవీ విరమణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టండి
కొత్త ఆలోచనాపరులు
1: సొంత స్టార్టప్ ప్రారంభించండి
2: నిజమైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియంను ఆదా చేయండి
పాత ఆలోచనలతో వెనుకపడిపోకండి. కొత్తగా ఆలోచించండి. మీ ఆలోచనలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని కియోసాకి పేర్కొన్నారు. ఎథెరియం, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టే పెట్టుబడులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని అన్నారు. జాగ్రత్త వహించండి అంటూ.. తన సందేశాన్ని ముగించారు.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
డబ్బును పొదుపుచేస్తే.. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కాబట్టి మీరు బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. దాని విలువ భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతుంది. మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని.. కియోసాకి చాన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు.
MY CONCERN:
“Old Thinking vs New THinking”
GAP between rich and poor becomes:
GRAND CANYON between rich and poor.
Billions of people are struggling to:
1: “Make Ends Meet”
2: “Keep Up With Inflation.”
3: “Keep their Job”
Old Thinkers:
1: Go back…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 25, 2025


