రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్‌లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.
అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.
మార్కెట్ క్రాష్ అంటే?
స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.
🚨 BREAKING:
RICH DAD POOR DAD AUTHOR ROBERT KIYOSAKI SAID:
"THE BIGGEST STOCK MARKET CRASH IS COMING IN 2026."
HE PREDICTED THE 2008 CRASH, WHEN S&P 500 CRASHED -50%
HE BELIEVES SOMETHING BAD IS COMING... pic.twitter.com/a6Gw0qrXxW— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) June 17, 2026


