‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’ | Robert Kiyosaki Warns Investors Against Blind Trust In US Bonds, Calls For Careful Market Analysis, Check Post Inside | Sakshi
Sakshi News home page

‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’

May 31 2026 1:44 PM | Updated on May 31 2026 4:07 PM

robert kiyosaki warns us bonds not safe buying gold silver

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.

సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.

అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement