డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ | Is Money the Real Reason to Become an Entrepreneur Robert Kiyosaki Clarity | Sakshi
Sakshi News home page

డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ

Jun 5 2026 8:22 PM | Updated on Jun 5 2026 8:45 PM

Is Money the Real Reason to Become an Entrepreneur Robert Kiyosaki Clarity

బంగారం, వెండి గురించి.. వాటిపై పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) తాజాగా డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా?, అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

చాలామంది డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా? అనే ప్రశ్న వేస్తుంటారు. కానీ వ్యాపారవేత్త కావడం వెనుక అసలు ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకూడదని కియోసాకి చెబుతారు. డబ్బు కోసం మాత్రమే వ్యాపారం మొదలు పెడితే, అది దీర్ఘకాలంలో విజయాన్ని ఇవ్వకపోవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.

నిజానికి డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కాదు. కానీ సంపాదించిన డబ్బును నిలుపుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల త్వరగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదు, ఒక ఆర్థిక విద్య కూడా అని కియోసాకి పేర్కొన్నారు.

ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో.. ఆస్తులు, బాధ్యతలు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం అవసరం. అలాగే నగదు ప్రవాహం, అప్పుల నిర్వహణ, పన్నుల వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడదు. ఈ జ్ఞానం లేకపోతే పెద్ద మొత్తంలో సంపాదించినా.. తిరిగి కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..

చాలామంది డబ్బు గురించి సలహాలు ఇస్తారు, కానీ వారు స్వయంగా వ్యాపారం చేసి అనుభవం పొందినవారు కాకపోవచ్చు. కాబట్టి ఎవరి సలహా అయినా గుడ్డిగా నమ్మకూడదు. స్వయంగా ఆర్థిక విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం. వ్యాపారవేత్త కావడం అంటే రిస్క్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ రిస్క్‌ను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం కూడా.

వ్యాపారం ప్రారంభించే ముందు 'నేను ఎంత డబ్బు సంపాదించగలను?' అనే ప్రశ్నకన్నా.. నేను సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించగలను? అనే ప్రశ్న చాలా ముఖ్యమైంది. సరైన ఆర్థిక జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం కూడా సాధ్యమవుతుందని కియోసాకి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement