డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే! | Want to Get Rich Master Skills Chasing Degrees robert kiyosaki Rich dad poor dad | Sakshi
Sakshi News home page

డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!

Jun 8 2026 8:51 PM | Updated on Jun 8 2026 8:51 PM

Want to Get Rich Master Skills Chasing Degrees robert kiyosaki Rich dad poor dad

ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్‌కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.

‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.

ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?

రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.

సేల్స్ (అమ్మకాలు)

వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.

  • ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.

  • ఎలా చర్చలు జరపాలి

  • ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.

  • విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.

ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్‌ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.

రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.

లెవరేజ్: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.

క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.

టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.

నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్‌ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Advertisement
 
Advertisement
Advertisement