‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్‌’ | Robert Kiyosaki Signals Gold Silver Rally Bitcoin Ethereum Buy Opportunity | Sakshi
Sakshi News home page

‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్‌’

Jun 21 2026 2:45 PM | Updated on Jun 21 2026 3:34 PM

Robert Kiyosaki Signals Gold Silver Rally Bitcoin Ethereum Buy Opportunity

ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్‌ కాయిన్‌, ఇథీరియమ్‌ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement