‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఇద్దరు నాన్నల ఆశీర్వాదం! | Robert Kiyosaki Fathers Day Message Rich Dad Poor Dad | Sakshi
Sakshi News home page

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఇద్దరు నాన్నల ఆశీర్వాదం!

Jun 22 2026 2:16 PM | Updated on Jun 22 2026 2:23 PM

Robert Kiyosaki Fathers Day Message Rich Dad Poor Dad

ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్ కియోసాకి ఫాదర్స్ డే సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ తండ్రి కాలేకపోయినా, జీవితంలో ఇద్దరు తండ్రుల ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. ఒకరు తన "పూర్ డాడ్", మరొకరు "రిచ్ డాడ్" అని తెలిపారు.

వారి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలే తన ఆలోచనా విధానాన్ని మార్చాయని, ఆ అనుభవాలను ప్రపంచానికి "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకం ద్వారా అందించగలిగానని కియోసాకి చెప్పారు. ఆ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు.

"తండ్రిగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. మీరు తండ్రి అయినా కాకపోయినా, ఈ రోజు మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి" అని కియోసాకి తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం జీవిత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సందేశం ద్వారా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement