‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్‌’ | Robert Kiyosaki WARNED predictions in Rich Dads Prophecy are coming true | Sakshi
Sakshi News home page

‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్‌’

Apr 17 2026 7:17 PM | Updated on Apr 17 2026 8:33 PM

Robert Kiyosaki WARNED predictions in Rich Dads Prophecy are coming true

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో హెచ్చరించారు.

బుడగ పేలిపోనుంది!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

బాధితులుగా మిగిలిపోకండి..
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

"ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.

ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

Advertisement
 
Advertisement
Advertisement