ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.
డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.
‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.
తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.
PLEASE BE AWARE
AI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.
Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.
I did not say that.
Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025


