ఆర్థిక వ్యవస్థపై కియోసాకి సంచలన వ్యాఖ్యలు! | Richest Man Decision That Affecting Normal People Life Says Kiyosaki | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థపై కియోసాకి సంచలన వ్యాఖ్యలు!

May 24 2026 7:37 PM | Updated on May 24 2026 7:46 PM

Richest Man Decision That Affecting Normal People Life Says Kiyosaki

పెట్టుబడులకు సంబంధించిన విషయాలను గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. కొంతమంది ఆర్ధిక నిర్ణయాలు, సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, చివరికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలను వివరాయించారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన లేదా శక్తివంతులైన కొంతమంది వ్యక్తులు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం, పన్నులు చెల్లించడం వంటి నియమాలను పాటిస్తూ జీవితం సాగిస్తారు. ఇవన్నీ పాటించినప్పటికీ.. ఆర్థికంగా స్వేచ్ఛ ఉండదు.

డబ్బు వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు.. ఉదాహరణకు, బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజల ఆదాయం, పొదుపు, అద్దె, రిటైర్మెంట్ వంటి విషయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఈ వ్యవస్థలో రెండు రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి డబ్బును నియంత్రించే వారు, మరొకటి కష్టపడి పనిచేసే సాధారణ ప్రజలు.

ఇదీ చదవండి: అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..

సాధారణ ప్రజలు చిన్ననాటి నుంచే ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, దాని నియమాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. ఇలా జీవితం గడిపి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా.. ఎక్కడ మొదలయ్యారో దాదాపు అక్కడే ఉంటారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నిజానికి పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు తొందరగా ధనవంతులు అవుతారు. ఉద్యోగం చేసి సాఫీగా జీవితం సాగించేవాళ్లకు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన నమ్మకం.

Advertisement
 
Advertisement
Advertisement