అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా.. | Silver Prices See Sharp Fluctuations Over the Week | Sakshi
Sakshi News home page

అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..

May 24 2026 6:55 PM | Updated on May 24 2026 7:06 PM

Silver Prices See Sharp Fluctuations Over the Week

బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించింది. కేవలం వారం రోజుల్లో (మే 17 నుంచి 23 వరకు) రేట్లు తగ్గుతూ.. పెరుగుతూ.. వారాంతంలో స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం వెండి రేటు ఎలా ఉంది?, ధరల తేడాకు ప్రధాన కారణం ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మే 17న (ఆదివారం) రూ.2,90,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు మే 23 (శనివారం) నాటికి రూ.2,95,000 వద్దకు చేరింది. అయితే వారం మధ్యలో వెండి రేటు రూ.3 లక్షలకు కూడా చేరింది. చివరకు కొంత తగ్గుదల కనిపించింది.

హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కేజీ వెండి రేటు రూ.2.95 లక్షల వద్ద ఉండగా.. ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశ రాజధాని నగరంలో సిల్వర్ రేటు తక్కువని స్పష్టమవుతోంది.

వెండి ధరలు పెరగడానికి కారణం!
మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.

పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.

అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.

వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.

ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!

Advertisement
 
Advertisement
Advertisement