ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన | Are You Working for Money or Making Money Work for You Kiyosaki Quote | Sakshi
Sakshi News home page

ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన

Apr 9 2026 6:40 PM | Updated on Apr 9 2026 8:06 PM

Are You Working for Money or Making Money Work for You Kiyosaki Quote

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.

రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.

మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.

ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.

చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.

కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?
➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. 
➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. 
➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.
➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.
➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.

మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.

ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement